రొంపిచర్లలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

58చూసినవారు
రొంపిచర్ల మండలంలోని ఆరేపల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుత తరుణంలో వరి పైరులో ఆకు చుట్టుపురుగు ఉందన్నారు. ఈ పురుగు నివారణకు కొబ్బరి పీచు తాడును రెండువైపులా పట్టుకొని వరి పైరులో లాగలన్నారు. అలా లాగితే ఆకు చుట్టుపురుగు నీటిలో పడి చనిపోతోందన్నారు. ఇలా చేయడం వల్ల పురుగు మందు ఖర్చు తగ్గించుకోవచ్చని అధికారులు రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్