75త్యాళ్ళూరు హైస్కూల్ లో అమరజీవికి ఘన నివాళి

70చూసినవారు
75త్యాళ్ళూరు హైస్కూల్ లో అమరజీవికి ఘన నివాళి
పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు హైస్కూల్లో ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆత్మార్పణ దినం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవియైన మహాపురుషుడు పొట్టి శ్రీరాములని వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఎ. శ్రీనివాస రెడ్డి, చైర్మన్ జి. పున్నారావు, ఉపాధ్యాయులు బాలకృష్ణా రెడ్డి, సాంబశివరావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్