ఆంధ్ర రాష్ట్రం కొరకు ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని క్రోసూరు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ బెల్లంకొండ రాంగోపాల్ రావు అన్నారు. ఆదివారం ఆయన వర్ధంతిని పెదకూరపాడు లో ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమ సమాజం ఏర్పడాలని ఆకాంక్షించారన్నారు. పొట్టి సత్యనారాయణ, కాల్వ అప్పారావు, పి శ్రీనివాసరావు, గుప్తా, చౌట శేఖరు, రావి చంద్రశేఖర రావు పాల్గొని నివాళులర్పించారు.