పొన్నూరులో వరల్డ్ ఓరల్ హెల్త్ డే కార్యక్రమం

81చూసినవారు
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం వరల్డ్ ఓరల్ హెల్త్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం డాక్టర్ శ్రావణ బాబు పాల్గొని వరల్డ్ ఓరల్ హెల్త్ డే మాసోత్సవాలను అర్బన్ పరిధిలో ఉన్న ఆరోగ్య కేంద్రాల వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి నోటి శుభ్రత వలన వచ్చే లాభాలు, నష్టాలను ప్రజలకు వివరించాలన్నారు. నోటిలో దంత క్షయ, క్యాన్సర్ వంటి వాటిపై తెలియజేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్