కాకుమాను: అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

81చూసినవారు
కాకుమాను: అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కాకుమాను మండల పరిధిలో ఖాళీగా ఉన్న పలు అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు సీడీపీవో సుజాత దేవి సోమవారం తెలిపారు. మండల పరిధిలోని చిన్నలింగాయపాలెం(ఎస్సీ-2), గరికపాడు(ఎస్టీ-1)లో అంగన్వాడీ సహాయకురాలు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. 21-35 మధ్య వయస్సు ఉండి, 7వ తరగతి ఉత్తీర్ణులై ఉన్నవారు వచ్చేనెల 5వ తేదీలోపు ప్రత్తిపాడు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్