గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాత మద్రాసు రోడ్డులోని వరగాని అబ్బినేని గుంట పాలెం గ్రామాల మధ్య మల్లాయపాలెం మేజర్ కాలువ పై ఉన్న పంపు హౌస్ లో కాపర్ వైర్లు ఆదివారం రాత్రి చోరీకి గురయ్యాయి. ఫీజు బాక్సులో కాపర్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. సోమవారం అబ్బి నేని గుంట పాలెం పంచాయతీ కార్యదర్శి నాగయ్య పెదనందిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.