గృహ నిర్మాణాలు వేగవంతం చేసేందుకు అధికారులు కృషి చేయాలి..

51చూసినవారు
గుంటూరు జిల్లా కాకుమాను మండలం ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో యుగ కీర్తి ఆధ్వర్యంలో "మన ఇల్లు -మన గౌరవం " కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీవో యుగ కీర్తి మాట్లాడుతూ మండలంలో గృహ నిర్మాణాలపై అధికారులతో సమీక్షించారు. గృహ నిర్మాణాలు వేగవంతం చేసేందుకు ప్రతి గ్రామంలో లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అమలు చేయవలసిన విధి విధానములపై చర్చించారు. మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్