సాయిబాబా వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

68చూసినవారు
సాయిబాబా వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
చెరుకుపల్లి వీర రాఘవపేటలో వేంచేసియున్న శ్రీ శిరిడి సాయిబాబా 28వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శుక్రవారం రేపల్లె శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మల్లెల కృష్ణమూర్తి మల్లెపూల అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనగాని మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్