రానున్న సంక్రాంతి పండగ సందర్భంగా నకరికల్లు మండల పరిధిలో ఎవరైనా కోడిపందేలు నిర్వహిస్తే, పేకాటలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం ఎస్ఐ సురేశ్ హెచ్చరించారు. గతంలో కోళ్ల పందెలు కేసులలో ఉన్నవారిని ఎమ్మార్వో వద్ద హాజరు పరచి వారిని 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు బైండోవర్ చేసామని, బైండోవర్ని ఉల్లంఘించి ఎవరైనా కోడి పందేలు నిర్వహిస్తే సదరు బైండోవర్ నగదును వారి నుంచి జప్తు చేసి కోర్టుకు అప్పగిస్తామన్నారు.