తన భర్త మానసికంగా వేధిస్తున్నాడని, హింసకు గురి చేస్తున్నాడని వన్ టౌన్ పోలీసులకు తలపాల మాధవి అనే మహిళ శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి గురవయ్య కాలనీకి చెందిన తలపాల మాధవి తన భర్త లక్ష్మీతిరుమల రావు తనను గత కొంత కాలంగా తరచూ శారీరకంగా, మానసికంగా హింసకు గురి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.