తెనాలి: తాళాలు పగలగొట్టి ఇంటిలోని వెండి వస్తువులు చోరీ

73చూసినవారు
తెనాలి: తాళాలు పగలగొట్టి ఇంటిలోని వెండి వస్తువులు చోరీ
తెనాలి మండలం కొలకలూరులో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వేజెండ్ల శివ నాగేశ్వరరావు జీఎంఆర్ సంస్థలో డైరెక్టర్గా పనిచేస్తుండగా ఆయనకు భార్య వసుంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరంతా ఢిల్లీలో ఉంటున్నారు. కొలకలూరులోని వీరి ఇంట్లోకి అర్ధరాత్రి దుండగుడు చొరబడి బీరువాలోని వెండి వస్తువులు ఎత్తుకెళ్లాడు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో చూసిన శివ నాగేశ్వరరావు ఫోన్ ద్వారా ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్