ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ రేషన్ దుకాణాలపై మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా గురువారం రాత్రి మెరుపు సోదాలు నిర్వహించారు. పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులతో పట్టణంలోని 5 దుకాణాల్లో తనిఖీ చేసి స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించారు. కార్డుదారులు బియ్యం ఇవ్వకుండా నగదు ఇస్తున్నారని పిర్యాదు అందినట్లు అధికారులు తెలిపారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.