వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది. రెండు రోజులు పాటు పోలీస్ కస్టడికి ఇస్తూ నరసరావుపేట కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఆయనను రేపు, ఎల్లుండి పోలీసులు విచారించనున్నారు. పోసాని కోరితే లాయర్ సమక్షంలో విచారణ చేయాలని సూచించింది. పోసాని బెయిల్ పిటిషన్‌పై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
కాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పోసానిపై నరసరావుపేట టుటౌన్‌లో కేసు నమోదైంది.