ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద వేచి ఉండటం ఇష్టం లేక ఏకంగా బైక్‌ను అతడి భుజంపై ఎత్తుకుని గేటును క్రాస్ చేశాడు. ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రియల్ బాహుబలి అంటూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.