తమిళనాడులోని త్రిరుత్తణిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును ఓ లారీ ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.