ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడులో నిర్వహించిన పోలేరమ్మ కొలుపులకు మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి హాజరయ్యారు. ఎడ్ల బండి ముందు మంత్రి నిలుచున్నారు. ఈ క్రమంలో డీజే సౌండ్‌కు ఎద్దు బెదిరి మంత్రిని కొమ్ముతో నెట్టింది. వెంటనే భద్రతా సిబ్బంది, నాయకులు ఎద్దును అడ్డుకుని మంత్రిని కాపాడారు.