AP: అమరావతి రాజధానిపై మంత్రి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. జనవరి నెలాఖరులోగా అన్నీ పూర్తి చేసి ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం అరాచక పాలనతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందన్నారు. అమరావతిని ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.