ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న ఏపీలో బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.5,200 కోట్లతో మెగావాట్ల విద్యుత్ నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కేంద్రం నిధులు విడుదల చేయనుంది. కడపలో 400 మెగా వాట్లు, కర్నూలులో 400 మెగా వాట్లు, చిత్తూరు జిల్లా కుప్పంలో 100 మెగా వాట్లు, గోదావరి జిల్లాలో 100 మెగా వాట్ల బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్లు నిర్మించనున్నారు.