కేరళలోని వయనాడ్‌లో నేటి నుంచి 48 గంటల పాటు ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఓ మహిళపై పులి దాడి చేయడంతో దాన్ని పట్టుకోవడానికి కర్ఫ్యూ విధించారు. వయనాడ్‌లోని మనత్‌వాడి ప్రాంతంలో ఓ మహిళ కాఫీ తీస్తుండగా ఆమెపై పులి దాడి చేసింది. ఈ దాడిలో సదరు మహిళ తీవ్రంగా గాయపడి మృతి చెందింది. దీంతో పులిని చంపాలని స్థానిక ప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో పులిని పట్టుకోవడం కోసం కర్ఫ్యూ విధించారు.