ఏపీలో అన్ని వర్గాలను దగా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై పార్టీ పరంగా పోరుబాటకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఫిబ్రవరి 5వ తేదీన ఫీజుపై పోరుబాటకు వైసీపీ సిద్ధమవుతోంది. ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టబోతోంది. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించనుంది.