ఏపీలోని పట్టణ స్థానిక సంస్థలకు కేంద్రం షాకిచ్చింది. ఎన్నికలు నిర్వహించకపోవడం, ఆస్తిపన్ను ఆదాయం పెంచుకోని కారణంగా రాష్ట్రంలోని 29 పట్టణ స్థానిక సంస్థలకు రూ.138 కోట్ల ఆర్థిక సంఘం నిధులను నిలిపివేసింది. 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి (2025-26) ముగిసే నాటికి నష్టపోయే నిధులు రూ.1000 కోట్లకుపైగా చేరుతాయని అంచనా. ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయాలంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. కానీ గత వైసీపీ ప్రభుత్వం 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించలేదు.