ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలని సూచించారు. పీఎం సూర్యఘర్ కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఎంఎస్‌ఎంఈ రుణాలను కేంద్రం సులభతరం చేసిందని పేర్కొన్నారు.