AP: ఏలూరులోని ఓ మిషనరీ సంస్థ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థిని ప్రసవం, బిడ్డను విసిరేయడంపై రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఈ ఘటనపై 3 రోజుల్లో సమగ్ర నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీని ఆధారంగా బాధ్యులపై చర్యలకు సిఫారసు చేస్తామని తెలిపింది. హాస్టల్ పిల్లలపై సిబ్బంది, తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.