కుప్పం: 12వ వార్డులో దోమల నివారణకు చర్యలు
కుప్పం మున్సిపాలిటీలో విష జ్వరాల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో మున్సిపల్ అధికారులు స్పందించారు. 12వ వార్డులో టిడిపి వార్డు ఇన్-ఛార్జ్ రవి ఆధ్వర్యంలో సోమవారం ఫాగింగ్ చేపట్టారు. దోమల వ్యాప్తిని అరికట్టి, ప్రజల ఆరోగ్యం కాపాడేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్, స్వామి పాల్గొన్నారు.