తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ. రంగంపేట సమీపంలో ఆర్టీసీ బస్సుకు గురువారం పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ కు ఛాతీలో నొప్పి రావడంతో ముందు వెళుతున్న కారును ఢీకొని పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కారు పాక్షికంగా దెబ్బతింది. చంద్రగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.