తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీపాదరాజ ముల్ బాగల్ మఠం పీఠాధిపతి శ్రీ సుజయనిది తీర్థ స్వామీజీ మంగళవారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద స్వామీజీకి ఆలయ అర్చకులు బాబు స్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారుఅమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న స్వామీజీకి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.