మదనపల్లి కోమటివాని చెరువులో మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. సుమారు 25 సంవత్సరాల వయసు కలిగిన మహిళల్లో చనిపోయి తేలాడుతూ కనిపించడం స్థానికులు బుధవారం గుర్తించి రెండవ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిందా లేక ఎవరైనా కొట్టి చంపి చెరువులో పడేశారా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఆచూకీ లభించలేదని కేసు దర్యాప్తులో ఉందని రెండవ పట్టణ సీఐ మురళీకృష్ణ చెప్పారు.