మద్యం బాబులకు రూ. 1. 10 లక్షలు జరిమానా: ట్రాఫిక్ సీఐ

57చూసినవారు
మద్యం బాబులకు రూ. 1. 10 లక్షలు జరిమానా: ట్రాఫిక్ సీఐ
మద్యం తాగుతూ వాహనాలు నడుపుతున్న వారికి కోర్టు రూ. 1. 10 లక్షల జరిమానా విధించినట్లు చిత్తూరు ట్రాఫిక్ సీఐ నిత్యబాబు మంగళవారం తెలిపారు. తనిఖీల్లో భాగంగా 11 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతుండగా పట్టుకున్నట్టు ఆయన చెప్పారు. వారిని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరచగా జడ్జి ఉమాదేవి జరిమానా విధించారన్నారు.

సంబంధిత పోస్ట్