అతిసార ప్రబలిన టీ వడ్డూరు నందు డిఎంహెచ్ఓ విస్తృత పర్యటన

79చూసినవారు
అతిసార ప్రబలిన టీ వడ్డూరు నందు డిఎంహెచ్ఓ విస్తృత పర్యటన
చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఓ ప్రభావతి దేవి పలమనేర్ మండలం టి వడ్డూరు నందు ప్రబలిన అతిసార కేసుల నిమిత్తమై మంగళవారం విస్తృతంగా తనిఖీ చేశారు. వర్షాకాలంలో కలుషిత నీటి వల్ల వాంతులు విరోచనాలు అక్కడక్కడ కనిపిస్తోంది. ప్రతి 15 రోజులకు తప్పనిసరిగా నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని, నీటి పైపుల లీకేజ్ ని రెక్టిఫై చేసుకోవాలని, ఇంటి పరిసరాలను నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్