వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని మండల శాంతి భద్రతల అధికారి ఎస్సై షేక్షావలి అన్నారు. గురువారం నాడు మండలంలోని పిల్లారి కుప్పం క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ షేక్షావలి మాట్లాడుతూ వాహనదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని, లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలని మద్యం సేవించి, లైసెన్స్ , లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వాహనదాలను హెచ్చరించారు.