గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు నూతన తహశీల్దార్ గా శ్రావణ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ ను జనసేన పార్టీ నాయకులు శాలువాతో సత్కరించారు. తహ సిల్దార్ మాట్లాడుతూ అధికారులు, నాయకులు సహకారంతో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.