పాదిరికుప్పం పంచాయితీలో థామస్ ప్రచారం

1547చూసినవారు
గంగాధరనెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం పాదిరికుప్పం పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని టిడిపి నాయకులు ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వి. ఎం థామస్ పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్లి టిడిపి మేనిఫెస్టోను వివరించి రానున్న ఎన్నికల్లో టిడిపిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్