చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలంలో గురువారం అనుమతులు లేని గ్రానైట్ లారీని పోలీసులు సీజ్ చేసినట్లు సమాచారం. అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో మండలంలో వెళ్తున్నటువంటి ప్రతి వాహనాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.