ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు చేసిన అభిమానులు

5347చూసినవారు
కుప్పం మండలం ఊరినాయనపల్లి గ్రామంలో ఆదివారం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన జన్మదినాన్ని ముందస్తుగా నిర్వహించారు. 100 అడుగుల ఎన్టీఆర్ చిత్రాన్ని సాల్ట్ ఆర్టుతో గీసి సంబరాలు చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ సీఎం, బాబులకే బాబు తారక్ బాబు అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల సమీపిస్తున్న నేపధ్యంలో జూనియర్ అభిమానులు చేసిన స్లోగన్లు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషియల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత పోస్ట్