కుప్పం: ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ఆర్టీసి బస్సు

69చూసినవారు
చిత్తూరు జిల్లా శాంతిపురం మండల పరిధిలోని కదిరిఓబనపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన గురువారం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. హుటా హుటిన స్థానికులు గుర్తించి గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్