రామకుప్పం:ప్రకృతి సోయగాల నెలవును పట్టించుకోరూ?

71చూసినవారు
రామకుప్పం:ప్రకృతి సోయగాల నెలవును పట్టించుకోరూ?
రామకుప్పం మండలం చెలిమిచేను గ్రామ సమీపంలోని జలపాతం ఏటా వర్షాకాలంలో జలసోయగాలు పోతుంది. పక్షుల కిలకిలరావాలు.... కనుచూపు మేర నలుదిక్కులా పరచుకున్న పచ్చదనం, అల్లంత ఎత్తు నుంచి జాలువారే జలాలు ప్రకృతి ప్రేమికులను అట్టే కట్టిపడేస్తాయి.చెలిమిచేను జలపాతాన్ని అభివృద్ధి చేస్తామన్న అటవీశాఖ హామీలు మాటలకే పరిమితమయ్యాయి. ఈ జలసోయగాలను తిలకించేందుకు కుప్పం, పలమనేరు నియోజకవర్గాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి రోజూ వందల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అలరించే ప్రకృతి అందాలున్న ఈ ప్రాంతంలో ఎటువంటి రక్షణ చర్యలు లేకపోవడం ప్రమాదకరంగా మారింది.

సంబంధిత పోస్ట్