గృహ ప్రవేశానికి తండ్రి పిలవలేదని కుమారుడి ఆత్మహత్య

57చూసినవారు
గృహ ప్రవేశానికి తండ్రి పిలవలేదని కుమారుడి ఆత్మహత్య
గృహ ప్రవేశానికి తండ్రి పిలవలేదని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగలాపురం మండలంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. నాగలాపురం లోని వీకేఎం వీధిలో బాబు అనే వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ లారీ డ్రైవరుగా పని చేస్తున్నారు. అతని తండ్రి భూపాల్ స్థానికంగా నూతనంగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి ఆదివారం గృహ ప్రవేశం ఉండగా ఆ కార్యక్రమానికి పిలువలేదని మన స్తాపంతో బాబు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్