మదనపల్లెలో నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

61చూసినవారు
మదనపల్లెలో నాటు సారా విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మదనపల్లి సిఐ చాంద్ బాషా తెలిపారు. మదనపల్లి మండలంలోని బుగ్గ కాలువ గ్రామంలో నాటుసారా విక్రయిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో సోమవారం సబ్ ఇన్స్పెక్టర్ ఆన్సర్ బాష తన సిబ్బందితో వెళ్లి నాటు సారా విక్రయిస్తున్న బాలాజీ నాయక్ ఇంటిలో సోదాలు జరిపారు. అమ్మకానికి సిద్ధంగా ఉన్న 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్