సారా తరలిస్తున్న మహిళ అరెస్ట్

2969చూసినవారు
నాటు సారా తరలిస్తున్న మహిళను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిమ్మనపల్లె ఎస్ఐ లోకేశ్ రెడ్డి వివరాల ప్రకారం. నిమ్మనపల్లె మండలంలోని నాగులయ్య గారిపల్లికి చెందిన సి. ఈశ్వరమ్మ (40) గ్రామానికి సమీపంలోని అడవి నుంచి 20 లీటర్ల సారా తీసుకు వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి వెళ్లి సారా స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేశామని ఎస్ఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్