ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున నగరి నియోజకవర్గ ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదివారం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వర్షాలు కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి, ప్రజలు ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లల్లో క్షేమంగా ఉండాలని సూచించారు. ఎటువంటి నష్టం వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి సహాయ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.