నగరి నియోజకవర్గ వ్యాప్తంగా శుక్రవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా పలువురు కొనియాడారు. రాజ్యాంగంలోని హక్కుల ద్వారా అందరికీ స్వేచ్ఛ కల్పించిన ఘనత అంబేడ్కర్ కే దక్కిందని దళిత సంఘం నాయకులు తెలిపారు. అనంతరం దళితుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.