తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నగిరి నియోజకవర్గం పుత్తూరు లో నిర్వహించే గిరి ప్రదక్షణ కార్యక్రమంలో గురువారం రాత్రి మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కళ్యాణపురం మండపం వద్దకు చేరుకున్న పలువురు దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.