తుఫాన్ పట్ల నగరి మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే భాను ప్రకాశ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని నగరి మునిసిపల్ అధికారులను కోరారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.