నగిరి: ఈనెల 26న వైసీపీ సమావేశం

64చూసినవారు
నగిరి: ఈనెల 26న వైసీపీ సమావేశం
చిత్తూరు జిల్లా నగిరి లోని ఏజేఎస్ కళ్యాణ మండపంలో ఈనెల 26న ఉదయం 9: 30 గంటలకు వైసీపీ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీమంత్రి రోజా కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి హాజరుకానున్నట్లు ముఖ్య నాయకులు చెప్పారు. వడమాలపేట, పుత్తూరు, నగిరి, నిండ్ర, విజయపురం మండలాల పరిధిలోని వైసీపీ శ్రేణులు ఈ సమావేశానికి హాజరు కావాలని నాయకులు కోరారు.

సంబంధిత పోస్ట్