నిండ్ర మండలం నెట్టేరి పంచాయతీలో మాజీ ఎంపీటీసీ చిత్తూరు పార్లమెంట్ రైతు కమిటీ ఉపాధ్యక్షులు బాబు యాదవ్ తండ్రి, టీడీపీ సీనియర్ నాయకులు కృష్ణయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ కృష్ణయ్య భౌతిక కాయం సందర్శించి బుధవారం నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.