నిండ్ర మండలంలో ఆదివారం ఉదయం శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామికి ప్రధాన వేద పండితులు హనుమాన్ చాలీసా పారాయణం జరిపారు. శ్రీ రవి స్వామి, సుబ్బు స్వామి, చైతన్య, అప్ప రాజు, పండితులతో కలిసి గురువులైన లోకేష్,శివ కుమార్,తులసి, గ్రామ భక్తులు అధిక సంఖ్యలో పారాయణంలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.