బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో పెంగల్ తుఫాను కారణంగా చిత్తూరు జిల్లా, నగరి నియోజకవర్గం పుత్తూరు మండలంలో బుధవారం ఉదయం 8: 30నుంచి గురువారం వరకు 13. 2 మి. మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మండలంలోని పలి చోట్ల చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు.