నగిరి నియోజకవర్గం, పుత్తూరు పురపాలక సంఘ కమిషనర్ మంజునాథ్ గౌడ ఆదేశాల మేరకు బుధవారం పట్టణ పరిధిలోని హోటళ్లలో ప్రజారోగ్య శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలు, అపరిశుభ్ర నిర్వహణ కలిగిన హోటళ్లకు జరిమానా విధించారు. ఈ తనిఖీలలో పురపాలక సంఘ అధికారి శ్రీనివాస్ బాబు సానిటరీ ఇన్స్పెక్టర్ ఇన్‌ఛార్జ్ మునస్వామి, తదితరులు పాల్గొన్నారు.