పలమనేరులో శివకుమార్ హత్యపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళిత సంఘాల నాయకుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. శివకుమార్ ను హత్య చేయడమే కాకుండా అతనే పోలీసులకు సమాచారం ఇవ్వడం దారుణం అన్నారు. సమీర్ ను త్వరగా అరెస్టు చేసి అతనిపై కఠిన చర్యలు తీసుకొని శివకుమార్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు మంగళవారం డిమాండ్ చేశారు.