గంగవరం మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా గురువారం ముగిసింది. ఎంపీడీఓ సురేశ్ తీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిధులు వెనక్కు వెళ్లేలా కావాలనే వర్క్ ఆర్డర్ ఇవ్వకుండా ఏవేవో కారణాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం ఎంపీపీకి కూడా సమాచారం ఇవ్వకుండా మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారని ఆరోపించారు. సభ్యులు అందరూ సమావేశాన్ని బాయ్ కాట్ చేయడంతో తిరిగి రేపటికి వాయిదా వేశారు.